28, అక్టోబర్ 2012, ఆదివారం

శాంతివనం పిల్లల కెంద్రాన్ని నాయుడు పాలెంనకు మార్పు చేయుటకు రంగం సిద్ధం అవుతుంది


శాంతివనం పిల్లల కెంద్రాన్ని నాయుడు పాలెంనకు మార్పు చేయుటకు రంగం సిద్ధం అవుతుంది 
ఫిల్లలలో శారీరక,మానసిక అభివృద్ధి జరగాలంటే పిల్లలు ప్రకృతికి  దగ్గరగా వుండాలి .అందుకే పిల్లల కేండ్రాన్ని నాయుడు పాలెమునకు మార్చడానికి సంకల్పించడం జరిగింది.నవంబర్ మాసాంతానికి పిల్లల  కెంద్రాన్ని నాయుడుపాలెంలోనే ఏర్పాటు చేసి ,పిల్లల సర్వతోముఖాభివృద్ధి కోసం అన్ని వేళళా పాటు పడడానికి కృషి చెయ్యడం,సమాజాన్ని కూడా దీనిలో భాగస్వామ్యం చెయ్యడం  జరుగుతుంది

శాంతివనం మొక్కల పెంపకం మరియు మొక్కలు నాటే కార్యక్రమము


శాంతివనం  మొక్కల పెంపకం  మరియు మొక్కలు నాటే కార్యక్రమము
నాయుడుపాలెం,కలికివాయ గ్రామాలలో దాదాపు నాలుగు వందలు మొక్కలు పిల్లలు,పెద్దలుకు  పంపిణీ చేసి,వారి చేతనే నాటించడం జరిగింది.శాంతివనం పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈకార్యక్రమము చేపట్టడం జరిగింది.
ఫిల్లల చేత మొక్కల  పెంపకం చేయించడం చేత వాళ్ళలో ఈ వయసు నుంచి పర్యావరణ  స్పృహ కలిగించడం ,ఒక మంచి అలవాటును వాళ్ళలో పెంపొందించడం,వాళ్ళ చేతులమీదుగా  ఒక పెరుగుదలను  ప్రత్యక్షమముగాచూడడము జరుగుతుంది. ఫిల్లల మానసిక,శారిరకాభివృద్ధిలో  భాగంగా ఈకార్యక్రమము నిరంతరాయంగా చేపట్టడము జరుగుతుంది








.

25, అక్టోబర్ 2012, గురువారం

శాంతివనం ఆచరించదగు మార్గదర్శక సూత్రాలు -మరియు అభినందనలు


శాంతివనం ఆచరించదగు  మార్గదర్శక సూత్రాలు

శాంతివనం ఉపాధ్యాయులకు,పాఠశాలలకు కొన్ని మార్గదర్శకాలను రూపొందించుకుని,వీటిని అనుసరించడానికి మార్గాలను అవెషిస్తంది.దీనిలో భాగంగానే జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులను ప్రకటించడం జరిగింది.
               

వీరే మన శాంతివనం ఉత్తమ ఉపాధ్యాయులు


వీరే మన శాంతివనం ఉత్తమ ఉపాధ్యాయులు
శాంతివనం జిల్లా వ్యాప్తంగా నిజంగా పనిచేస్తూ ఉన్న ఉపాధ్యాయులను ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తించి ఒక రోజు సదస్సు ఏర్పాటు చేసి,వాళ్ళవాళ్ళ అనుభవాలను పంచుకుంటూ,వారిని సన్మానించడం జరిగింది.


24, అక్టోబర్ 2012, బుధవారం

ప్రతి రోజూఉదయం డాక్టర్ల వాలీబాల్- ఆటా మాటా


ప్రతి రోజూఉదయం డాక్టర్ల వాలీబాల్ ఆటా మాటా
ఒంగోల్లో ఆంధ్రకేసరి కాలేజీలో డాక్టర్ సుధాకర్ ఆధ్వర్యం లోదాదాపు ఇరవై మంది డాక్టర్లు మాటామాటా మాట్లాడుకుంటూ   ఆనందం గా వాలీబాల్ ఆడుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మనుషుల గురించి ఆలోచిస్తారు. 










డాక్ట్ర్ సుధాకర్ ఆధ్వర్యం లోదాదాపు ఇరవై మంది డాక్టర్లు మాటామాటా మాట్లాడుకుంటూ   ఆనందం గా వాలీబాల్ ఆడుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మనుషుల గురించి ఆలోచిస్తారు.


17, అక్టోబర్ 2012, బుధవారం


కలికివాయ మరియు పి.నాయుడుపాలెం లలో యువ సంఘాల ఏర్పాటు



మా స్వంత గ్రామాభి వృద్ధి కొరకు మరియు నేను పని చేసే గ్రామంలో చదువు కునే పిల్లల అభివృద్ధి కొరకు యువజనులు మరియు విద్యావంతులు ,ఉద్యోగులతో సమావేశాలు ఏర్పాటు చేసికోఆపరేటివ్ సొసైటీ లను ఏర్పాటు చెయ్యడం ద్వారా ఆయా గ్రామాలలో చదువుకునే పిల్లలకు ప్రోత్సాహ మందించడం సులువు అవుతుంది.
గ్రామ సమగ్రాభివృద్ధికి ఈ సంఘాలు ఎంతొ దోహదం చేస్తాయి.

శాంతివనంసైకిల్ క్లబ్ ప్రారంభం


శాంతివనం సైకిల్ క్లబ్ ప్రారంభం

శాంతివనం సైకిల్ క్లబ్ ప్రారంభించి 2 నెలలు అయింది.ప్రతినెల మొదటి ఆది వారం సైకిల్ రేలీ నిర్వహించిన అనంతరం పిల్లలతో పెద్దలతో మాట్లాడించి వాళ్ళలో గల స్రుజనాత్మకతను వెలికితీసే ప్రయత్నం శాంతివనం చేస్తుంది. 

శ్రీవాసుదేవరావ్ శ్రీమతి సత్యసుజాత దంపతులు శాంతివనంలొ సభ్యులు గాచేరారు

శ్రీవాసుదేవరావ్ శ్రీమతి సత్యసుజాత దంపతులు
 శాంతివనంలొ సభ్యులుగా చేరి,ఒక పిల్లవాణ్ణి దత్తత తీసుకుని
 ప్రతి సంవత్సరం వాని ఖర్చులు నిమిత్తం10,000 రూపాయలు
 ఇస్తామని తెలియజేశారు.

2, అక్టోబర్ 2012, మంగళవారం

డా'సమత ,గుళ్ళాపల్లి శ్రీనివాస్ [NRI] Rs.వెంకట్రావ్ గారు[NRI] శాంతివనం లో సభ్యులుగా చేరారు

డా'సమత Rs.10,000 గుళ్ళాపల్లి శ్రీనివాస్ [NRI] Rs.10,000వెంకట్రావ్ గారు[NRI]Rs5,000 బహూకరించి శాంతివనం లో సభ్యులుగా చేరారు.వీరు శాంతివనం కార్యక్రమాలను అభినందిస్తూ తమ సహాయ సహకారాలను అందిస్తామని తెలియజేశారు.