26, డిసెంబర్ 2012, బుధవారం

పిల్లలతో ఫీల్డ్ ట్రిప్ మరియు ట్రెక్కింగ్







పిల్లల ప్రపంచం నాయుడు పాలెం పిల్లల త్రైమాస పత్రిక

నాయుడుపాలెం బడి పిల్లల సహజ ప్రతిభ

 నాయుడుపాలెం పాఠశాలలో పిలలు సహజ ప్రతిభను కనబరుస్తున్నారు.
వారి స్వంత ప్రతిభతో కవితలు,కథలు రాస్తున్నారు.
వారి రచనలతొ పిల్లల ప్రపంచం పిల్లల పత్రిక ప్రారంభమయింది .
అంతేకాక నాటికలు,నేల ప్రదర్శనలు కూడా స్వంతంగా రూపోందించి ప్రదర్శిస్తున్నారు. 





శాంతివనానికి ఉపాధ్యాయుల విరాళం


  శాంతివనం ఉపాధ్యాయ కమిటి సమావేశంలో స్రీమతి సత్య సుజాత మరియు బూడవాడ జెడ్ పి స్కూల్ ప్రధానోపాధ్యాయులు  శాంతివనం పిల్లల కోసం పదివేలు విరాళంగా అందజేశారు.
ఈ సమావేశంలో పిల్లల కోసం,ప్రభుత్వ పాఠశాలల కోసం శాంతివనం ఏమి చెయ్యాలో చర్చించారు.ఈ చర్చలో శాంతివనం ఒక విద్యా పరిశోధనా కేంద్రంగా,వనరుల కేంద్రంగా తీర్చిదిద్దాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.     




29, నవంబర్ 2012, గురువారం

శాంతివనం కేంద్రాన్ని ఒంగోలు నుండి చీమకుర్తి మండలం నాయుడుపాలెం గ్రామానికి మర్చడం జరిగింది



                       ఇదే ప్రస్తుత మన శాంతివనం పిల్లల కేంద్రం

శాంతివనం పిల్లల కేంద్రాన్ని ఒంగోలు నుండి చీమకుర్తిమండలం నాయుడు గ్రామానికి మర్చడం జరిగింది.శాంతివనం పిల్లలతో పాటు గ్రామంలోని నాలుగు వందల మంది పిల్లలకు కలిపి కార్యక్రమము చేపట్టడం జరిగింది.

శాంతివనం ప్రభుత్వ పాఠశాలల కు చేయూత, వివిధ పోటీలు

  శాంతివనం ప్రభుత్వ పాఠశాలలను
,అక్కడ చదువుతున్న పిల్లలను ప్రోత్సహించే కార్యక్రమములో భాగంగా ఒంగోల్లో పీ.వీ.ఆర్ ప్రభుత్వ మునిసిపల్ పాఠశాల పిల్లలకు
 వివిధ కార్యక్రమాలను నిర్వహంచడం జరిగింది.
ఈ కార్యక్రమములో సీనియర్ జడ్జ్ శ్రీ రాంగోపాల్ గారు,
డా సుధాకర్, మంచికంటి ,పాఠశాల ప్రధానోపాధ్యాయులు,సిబ్బంది పాల్గొని పిల్లలకు బహుమతుల ప్రధానం చెయ్యడం జరిగింది.










1, నవంబర్ 2012, గురువారం

పిల్లల సృజనాత్మకతకు అద్దం పట్టే దృశ్యాలివి.

.పిల్లల సృజనాత్మకతకు అద్దం పట్టే దృశ్యాలివి.
 ఉపాధ్యాయులు  పిల్లల్లో ప్రతిభను గుర్తిస్తే పిల్లలు సృష్టించే అధ్బుతాలకు నిదర్శనాలివే. 




















28, అక్టోబర్ 2012, ఆదివారం

శాంతివనం పిల్లల కెంద్రాన్ని నాయుడు పాలెంనకు మార్పు చేయుటకు రంగం సిద్ధం అవుతుంది


శాంతివనం పిల్లల కెంద్రాన్ని నాయుడు పాలెంనకు మార్పు చేయుటకు రంగం సిద్ధం అవుతుంది 
ఫిల్లలలో శారీరక,మానసిక అభివృద్ధి జరగాలంటే పిల్లలు ప్రకృతికి  దగ్గరగా వుండాలి .అందుకే పిల్లల కేండ్రాన్ని నాయుడు పాలెమునకు మార్చడానికి సంకల్పించడం జరిగింది.నవంబర్ మాసాంతానికి పిల్లల  కెంద్రాన్ని నాయుడుపాలెంలోనే ఏర్పాటు చేసి ,పిల్లల సర్వతోముఖాభివృద్ధి కోసం అన్ని వేళళా పాటు పడడానికి కృషి చెయ్యడం,సమాజాన్ని కూడా దీనిలో భాగస్వామ్యం చెయ్యడం  జరుగుతుంది

శాంతివనం మొక్కల పెంపకం మరియు మొక్కలు నాటే కార్యక్రమము


శాంతివనం  మొక్కల పెంపకం  మరియు మొక్కలు నాటే కార్యక్రమము
నాయుడుపాలెం,కలికివాయ గ్రామాలలో దాదాపు నాలుగు వందలు మొక్కలు పిల్లలు,పెద్దలుకు  పంపిణీ చేసి,వారి చేతనే నాటించడం జరిగింది.శాంతివనం పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈకార్యక్రమము చేపట్టడం జరిగింది.
ఫిల్లల చేత మొక్కల  పెంపకం చేయించడం చేత వాళ్ళలో ఈ వయసు నుంచి పర్యావరణ  స్పృహ కలిగించడం ,ఒక మంచి అలవాటును వాళ్ళలో పెంపొందించడం,వాళ్ళ చేతులమీదుగా  ఒక పెరుగుదలను  ప్రత్యక్షమముగాచూడడము జరుగుతుంది. ఫిల్లల మానసిక,శారిరకాభివృద్ధిలో  భాగంగా ఈకార్యక్రమము నిరంతరాయంగా చేపట్టడము జరుగుతుంది








.