14, మే 2011, శనివారం

పిల్లల ఆనందం వర్ణనాతీతం




ప్రభుత్వ బడులలో పిల్లలకు జీవితం పట్ల భరోసా






ప్రభుత్వ బడులలో శాంతి వనం కార్యక్రమములో పిల్లలతో మాట్లాడించి వాళ్లకు చదువు పట్ల ,జీవితము పట్ల అవగాహన కలిగించి వాళ్ళు చదివేదే నిజమైన చదువని భరోసా ఇవ్వడం జరిగింది.వీళ్ళకు కూడా కథల పుస్తకాలు బహుమతులుగా ఇవ్వడం జరిగింది.

బడులలో చెట్లు నాటే కార్యక్రమము















ప్రభుత్వ బడులలో మొక్కలు నాటే కార్యక్రమము ద్వారా పిల్లల్లో పర్యావరణము పట్ల అవగాహన కలిగించుటకు వాళ్ళ చేతే చెట్లు నాటిం చే కార్యక్రమానికి శాంతి వనం శ్రీకారము చుట్టింది.పిల్లలు చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమములో పాలుపంచుకున్నారు.

శాంతి వనం బడిపిల్లలతో

శాంతి వనం బడి పిల్ల వద్దకు వెళ్లి తెలుగు భాష అవగాహన కావించే ప్రయత్నమూ చేస్తుంది.తెలుగులో మాట్లాడించడం పాటలు పాడడము,తెలుగు రాయడం,వంటి పోటీలు పెట్టి కథల పుస్తకాలు మాత్రమె బహుమతులుగా ఇవ్వడం జరిగింది.ఇలాగ ఒంగోలు లో నలభై బడులలో ఈ కార్యక్రమము జరిగింది.దాదాపు యాభై వేల మంది పిల్లలు ఈ కార్యక్రమములో పాలు పంచుకోవడం జరిగింది.



శాంతి వనం పిల్లల సృ జనాత్మక పోటీలు

బడి పిల్లలకు అనేక స్థాయిలలో అనేక రకాల పోటీలు శాంతి వనం నిర్వహించింది.జానపద గీతాలు,సృజనాత్మక వస్తువుల తయారి ,డ్రాయింగ్ ,సాంప్రదాయ నృత్యాలు వీటిలో పోటీలు నిర్వహించి కథా పుస్తకాల రూపం లోనే బహుమతులు ఇవ్వడం జరిగింది.తెలుగు చదవడం, భాష ,సంస్కృతీ అలవాడటానికి శాంతి వనం కృషి చేస్తుంది.