ప్రభుత్వ బడులలో శాంతి వనం కార్యక్రమములో పిల్లలతో మాట్లాడించి వాళ్లకు చదువు పట్ల ,జీవితము పట్ల అవగాహన కలిగించి వాళ్ళు చదివేదే నిజమైన చదువని భరోసా ఇవ్వడం జరిగింది.వీళ్ళకు కూడా కథల పుస్తకాలు బహుమతులుగా ఇవ్వడం జరిగింది.
ప్రభుత్వ బడులలో మొక్కలు నాటే కార్యక్రమము ద్వారా పిల్లల్లో పర్యావరణము పట్ల అవగాహన కలిగించుటకు వాళ్ళ చేతే చెట్లు నాటిం చే కార్యక్రమానికి శాంతి వనం శ్రీకారము చుట్టింది.పిల్లలు చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమములో పాలుపంచుకున్నారు.
శాంతి వనం బడి పిల్ల వద్దకు వెళ్లి తెలుగు భాష అవగాహన కావించే ప్రయత్నమూ చేస్తుంది.తెలుగులో మాట్లాడించడం పాటలు పాడడము,తెలుగు రాయడం,వంటి పోటీలు పెట్టి కథల పుస్తకాలు మాత్రమె బహుమతులుగా ఇవ్వడం జరిగింది.ఇలాగ ఒంగోలు లో నలభై బడులలో ఈ కార్యక్రమము జరిగింది.దాదాపు యాభై వేల మంది పిల్లలు ఈ కార్యక్రమములో పాలు పంచుకోవడం జరిగింది.